గోల్డెన్ టెంపుల్‌లో పాల్వంచ విద్యార్థినిల నృత్య ప్రదర్శన
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: తమిళనాడు రాష్ట్రం వెల్లూరులోని శ్రీపురం గోల్డెన్ టెంపుల్ పరిధిలో నారాయిణీ పీఠం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక వేదికపై పాల్వంచకు చెందిన శ్రీ సంతోషిని నాట్య నిలయం విద్యార్థినులు ఇచ్చిన నృత్య ప్రదర్శన అదిరిపోయింది. నాట్యాచార్యురాలు రమాదేవి నేతృత్వంలో 15 మంది చిన్నారులు ప్రహర్షిత, ప్రత్యూష, యోషిత, ధాత్రి, యశశ్విత, వర్షిని, తన్మయ, లోకాక్షిత, కీర్తన, జశ్విత, మాన్విత, మీనాక్షి, చైత్రిక, రమాదేవి, సమత ఐదు రకాల నృత్యాలను ప్రదర్శించారు.
వీరి ప్రదర్శనకు ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. నాట్య ప్రదర్శన అనంతరం నిర్వాహకులు విద్యార్థినులను ప్రశంసిస్తూ సాంస్కృతిక కమిటీ తరఫున నాట్యాచార్యురాలు రమాదేవి దంపతులను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థినులకు స్వామివారి ప్రసాదం, ప్రశంసాపత్రాలు అందించారు. కుటుంబ సభ్యులకు ఉచిత దర్శనం, వసతి, భోజన సౌకర్యాలు కల్పించారు. చిన్నారుల ప్రతిభ మంత్రముగ్ధులను చేసిందని నిర్వాహకులు ప్రశంసించారు.

Post a Comment