మందుబాబులకు కోర్టు పనిష్మెంట్

మందుబాబులకు కోర్టు పనిష్మెంట్

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం అతిగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 22 మందికి జరిమానాలు విదిస్తూ సోమవారం కొత్తగూడెం స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ మెండు రాజమల్లు తీర్పు వెలువరించారు.

కొత్తగూడెం వన్ టౌన్ ఎస్‌ఐ టి. రాకేష్ తెలిపిన వివరాల ప్రకారం, వాహన తనిఖీల్లో 12 మందిని నిలిపి బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షించగా మద్యం సేవించినట్టు రుజువైంది. అనంతరం కోర్టులో హాజరుపరచగా నేరం ఒప్పుకొన్న వారికి మేజిస్ట్రేట్ జరిమానా విధించారు.

అన్నపురెడ్డిపల్లి ఎస్‌హెచ్‌ఓ సి.హెచ్. చంద్రశేఖర్ కథనం ప్రకారం, ఐదుగురు వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీరిని కూడా బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షించి కోర్టులో ప్రవేశపెట్టగా నేరం ఒప్పుకున్నారు. వెంటనే మేజిస్ట్రేట్ జరిమానాలు విధించగా, వారు వాటిని చెల్లించారు.

పాల్వంచ టౌన్ ఎస్‌హెచ్‌ఓ ఐ. జీవన్ రాజ్ పర్యవేక్షణలో నిర్వహించిన తనిఖీల్లో మరో ఐదుగురు మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుబడ్డారు. వారికీ పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరచగా, నేరాన్ని ఒప్పుకొన్నందున జరిమానాలు విధించగా వెంటనే చెల్లించారు.

ఈ కేసులలో నేరం చేసిన 22 మందికి జరిమానాలతో పాటు కొత్తగూడెం జిల్లా కోర్టు ఆవరణలో మూడు గంటల పాటు సేవలు అందించాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు.


Blogger ఆధారితం.