బాలల రక్ష భవన్‌ను ఆకస్మికంగా పరిశీలించిన న్యాయాధికారి ఎం.రాజేందర్

బాలల రక్ష భవన్‌ను ఆకస్మికంగా పరిశీలించిన  న్యాయాధికారి ఎం.రాజేందర్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం కొత్తగూడెంలోని  బాలల రక్ష భవన్‌ను శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన భవన్‌లో నిర్వహణ, సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు. పిల్లల రక్షణకు సంబంధించి తీసుకుంటున్న చర్యలపై నిర్వాహకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం రిజిస్టర్లను పరిశీలించి పలు సూచనలు చేశారు.


పిల్లల హక్కులు, భద్రతకు సంబంధించి ఎటువంటి లోపాలూ ఉండకూడదని అధికారులు, సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు

Blogger ఆధారితం.