అతిగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 26 మందికి కోర్టు జరిమానా
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: అతిగా మద్యం సేవించి వాహనాలు నడిపిన కేసుల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు 26 మందికి జరిమానాలు విధించింది. శుక్రవారం కొత్తగూడెం స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ మెండు రాజమల్లు ఈ మేరకు తీర్పు వెల్లడించారు.
కొత్తగూడెం వన్ టౌన్ ఎస్‌ఐ టి. రాకేష్ తెలిపిన వివరాల ప్రకారం, వాహన తనిఖీల సమయంలో 13 మందిని ఆపి బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షించగా వారు మద్యం సేవించినట్లు రుజువైంది. నిందితులను కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో వారు నేరాన్ని ఒప్పుకోవడంతో మేజిస్ట్రేట్ జరిమానా విధించారు.
ఇక కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్‌ఐ కె. నరేష్ కథనం ప్రకారం, మరో 9 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతుండగా పట్టుబడ్డారు. వారిని కూడా కోర్టులో ప్రవేశపెట్టగా నేరాన్ని అంగీకరించడంతో మేజిస్ట్రేట్ జరిమానాలు విధించారు.
అదే విధంగా, పాల్వంచ టౌన్ ఎస్‌హెచ్‌ఓ ఐ. జీవన్ రాజ్ పర్యవేక్షణలో నిర్వహించిన తనిఖీల్లో నలుగురు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షల్లో ఇది రుజువవడంతో వారిని కోర్టులో హాజరుపరిచారు. నేరాన్ని ఒప్పుకున్నందున మేజిస్ట్రేట్ జరిమానాలు విధించారు.
.webp)
Post a Comment