కోర్టు కానిస్టేబుళ్లతో న్యాయాధికారి ఎం.రాజేందర్ సమీక్షా సమావేశం

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: జిల్లా కోర్టులో జూన్ 14న జరగనున్న జాతీయ అదాలత్‌లో ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ సూచించారు. గురువారం తన ఛాంబరులో కోర్టు కానిస్టేబుళ్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు, ఈపీటీ కేసుల వివరాలను పోలీస్ స్టేషన్ వారీగా అడిగి తెలుసుకున్నారు. సంబంధిత కేసులను వీలైనంత త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ అదాలత్‌లో సాధ్యమైనన్ని కేసులు పరిష్కారం కావడం ద్వారా ప్రజలకు వేగంగా న్యాయం అందేలా చూడాలని కోరారు.
Post a Comment