కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జస్టిస్ ఎం.జి. ప్రియదర్శిని సంతాప సభ

కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  జస్టిస్ ఎం.జి. ప్రియదర్శిని సంతాప సభ
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్న జస్టిస్ ఎం.జి. ప్రియదర్శిని ఇటీవల హఠాన్మరణం చెందారు. ఈ సందర్భంగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కోర్టు లైబ్రరీ హాల్లో సంతాప సభ నిర్వహించారు.

బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సభ ప్రారంభంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్, అదనపు జిల్లా జడ్జి ఎస్. సరిత, సీనియర్ సివిల్ జడ్జి కె. కిరణ్ కుమార్, అదనపు సివిల్ జడ్జి కె. కవిత, డీఎల్ఎస్ కార్యదర్శి ఎం. రాజేందర్, జూనియర్ సివిల్ జడ్జీలు సుచరిత, సాయి శ్రీ, బి. రవికుమార్, కొత్తగూడెం  స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు  తదితరులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాల మౌనం పాటించారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ మాట్లాడుతూ “జస్టిస్ ప్రియదర్శిని 2008లో జిల్లా జడ్జిగా తన సేవలను ప్రారంభించి అనేక జిల్లాల్లో న్యాయ సేవలు అందించారు. 2022లో హైకోర్టు న్యాయమూర్తిగా పదవిని స్వీకరించారు. న్యాయవ్యవస్థలో ఆమె చేసిన సేవలు అపూర్వమైనవి. ఆమె మరణం న్యాయరంగానికి పూరించలేని లోటు” అని పేర్కొన్నారు.

అనంతరం అదనపు జిల్లా జడ్జి ఎస్. సరిత, సీనియర్ జడ్జి కె. కిరణ్ కుమార్‌లు జస్టిస్ ఎం.జి. ప్రియదర్శినితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జే. గోపికృష్ణ, ప్రధాన కార్యదర్శి భాగం మాధవరావు, సహాయ కార్యదర్శి కాసాని రమేష్, కోశాధికారి కె. చిన్నికృష్ణ, మహిళా కార్యదర్శి అడపాల పార్వతి, క్రీడల కార్యదర్శి ఉప్పు అరుణ్, గ్రంథాలయ కార్యదర్శి మాలోత్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


Blogger ఆధారితం.