పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: పాల్వంచ మండలం కేశవాపురం–జగన్నాథపురం గ్రామాల్లో వెలసిన శ్రీ కనకదుర్గ దేవస్థానంలో (పెద్దమ్మ గుడి) గురువారం రాష్ట్ర సమాచార, రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దేవస్థాన సంప్రదాయాల ప్రకారం వేద పండితులు, అర్చకులు, కార్యనిర్వాహణాధికారి ఎన్.రజనీకుమారి, పాలకమండలి సభ్యులు వూర్ణకుంభాలతో మంత్రిని ఘనంగా స్వాగతించారు. పూజల అనంతరం అర్చకులు ఆశీర్వచనం అందించగా, దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు అమ్మవారి శేషవస్త్ర ప్రసాదాన్ని మంత్రికి అందించారు.
ఈ కార్యక్రమంలో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, జిల్లా డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుకృత పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

Post a Comment