అతిగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 22 మందికి జరిమానా

అతిగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 22 మందికి జరిమానా

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెంఅతిగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 22 మందికి జరిమానాలు విదిస్తూ గురువారం కొత్తగూడెం స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ మెండు రాజమల్లు తీర్పు చెప్పారు.

కొత్తగూడెం వన్‌టౌన్ ఎస్‌ఐ జి.విజయలక్ష్మి కధనం ప్రకారం..వాహన తనిఖీల్లో 12 మందిని ఆపి బ్రెత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించగా మద్యం సేవించినట్లు రుజువైంది. నిందితులను కోర్టులో హాజరుపరచగా వారు నేరం ఒప్పుకున్నందున మేజిస్ట్రేట్ జరిమానాలు విధించారు.

కొత్తగూడెం మూడవ టౌన్ ఎస్‌ఐ పురుషోత్తం కథనం ప్రకారం మరో ముగ్గురు మద్యం తాగి వాహనాలు నడుపుతున్న సమయంలో పట్టుబడ్డారు. వారికీ బ్రెత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించగా మద్యం సేవించినట్టు నిరూపితమైంది. కోర్టులో విచారణలో నేరం ఒప్పుకోవడంతో వారికీ జరిమానాలు విధించగా, జరిమానాలు చెల్లించారు.

పాల్వంచ టౌన్ ఎస్‌హెచ్‌ఓ ఐ.జీవన్‌రాజ్, డి.రాఘవయ్యల పర్యవేక్షణలో నిర్వహించిన వాహన తనిఖీల్లో ఏడుగురు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు వెల్లడైంది. బ్రెత్ ఎనలైజర్ పరీక్షల్లో మద్యం తాగినట్లు రుజువవడంతో వారిని కోర్టులో హాజరుపరిచారు. నేరం ఒప్పుకున్నందున మేజిస్ట్రేట్ జరిమానాలు విధించగా, వారు జరిమానాలు చెల్లించారు.

Blogger ఆధారితం.