సీనియర్ న్యాయవాది భౌతికకాయానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి నివాళి
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: సీనియర్ న్యాయవాది ఆళ్ల గురు ప్రసాద్ రావు మృతి పట్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ సంతాపం తెలిపారు. ఆళ్ల గురు ప్రసాద్ రావు భౌతికకాయాన్ని ఆదివారం సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, పోసాని రాధాకృష్ణమూర్తి, సింగరేణి కాలరీస్ లీగల్ అడ్వైజర్ వెల్లంకి వెంకటేశ్వరరావు, చండ్ర నాగేంద్రబాబు, న్యాయవాదుల గుమస్తాలు కె.వెంకటేశ్వరరావు, రాజేష్‌లు...ఆళ్ల గురు ప్రసాద్ రావు సేవలను వారు స్మరించుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Post a Comment