జలగం యువసేన ఆధ్వర్యంలో సర్దార్ జలగం వెంగళరావు జయంతి వేడుకలు

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి సర్దార్ జలగం వెంగళరావు 103వ జయంతిని జలగం యువసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పూర్ణ టీ స్టాల్ ప్రాంగణంలో జరిగిన వేడుకల్లో పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జలగం వెంగళరావు రాష్ట్రానికి చేసిన సేవలు చిరస్మరణీయమని వక్తలు గుర్తుచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆయన ఉంచిన పునాది శాశ్వతంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాకు సింగరేణి, నవభారత్, స్పాంజ్ ఐరన్, ఐటీసీ, హెవీ వాటర్ ప్లాంట్ వంటి కీలక పరిశ్రమలను తీసుకురావడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత ఆయనకే చెందుతుందని తెలిపారు. అలాగే, కిన్నెరసాని వంటి ప్రాజెక్టుల ద్వారా పర్యాటక అభివృద్ధికి దోహదం చేశారని చెప్పారు.
జలగం వెంగళరావు సేవలు, ఆయన జీవితం భవిష్యత్ తరాలకు మార్గదర్శకమవుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చాలని ప్రభుత్వం ను కోరారు.
ఈ కార్యక్రమంలో టీయూఎఫ్ జిల్లా అధ్యక్షుడు మంజూర్, నాయకులు జమ్ముల సీతారాం రెడ్డి, కేశూలాల్ నాయక్, శ్రీపాద సత్యనారాయణ, బొల్లం భాస్కర్, భాస్కర్ రావు, టైగర్ దుర్గాప్రసాద్, సమ్మిరెడ్డి జనార్ధన్ రెడ్డి, కొండపల్లి సీతారామయ్య, అప్పల నాయుడు, కేసరి రవీందర్, మురళీకృష్ణ, బిల్లా సుజిత్, సురేష్ నాయక్, సుధాకర్, సమ్మయ్య, చంద్రశేఖర్ రెడ్డి, తాజుద్దీన్, గణేష్, మహేశ్వరం శ్రీనివాస్, పెద్దిరాజు, పరమేష్ తదితరులు పాల్గొని జలగం వెంగళరావు సేవలను స్మరించుకున్నారు.
Post a Comment