స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి: సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సీపీఐ కార్యకర్తలు పూర్తిగా సిద్ధంగా ఉండాలని జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక చండ్ర రాజేశ్వరరావు భవన్‌లో సీపీఐ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలోని ప్రతి పంచాయతీలో సీపీఐ ప్రాతినిధ్యం ఉండేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించాలని, పార్టీ విస్తరణకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. డిసెంబర్ 26 నాటికి సీపీఐ శతవసంతం పూర్తి చేసుకుంటోందని, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గ్రామగ్రామాన వందేళ్ల వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. పార్టీ చరిత్ర, త్యాగాలను ప్రజలకు వివరించేందుకు ప్రతీ గ్రామంలో, బస్తీలో వేడుకలు జరపాలని పిలుపునిచ్చారు.
పేదలు, కష్టజీవులు, కర్షకులు, కార్మికుల పార్టీగా సీపీఐ నిలుస్తోందని, సుదీర్ఘ పోరాటాలతో నిర్మితమైన ఎర్ర జెండా పార్టీకి ప్రత్యామ్నాయం లేదని తెలిపారు. "మరో వందేళ్లైనా చెక్కు చెదరకుండా సీపీఐ అజేయంగా నిలుస్తుంది" అని ఆయన పునరుద్ఘాటించారు. ప్రజలతో మమేకమై, వారికోసం చేస్తున్న సేవల ఫలితంగానే సీపీఐకి జనాదరణ పెరుగుతోందని పేర్కొన్నారు.
పాల్వంచ అభివృద్ధిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. ఇప్పటికే రోడ్లు, డ్రైన్లు, నీటి పథకాలపై పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయ్యాయని, మిగతావి త్వరలో ప్రారంభమవుతాయన్నారు. ప్రజలకు కావలసిన మౌలిక వసతుల కల్పనకు కృషి కొనసాగుతుందని తెలిపారు.
నిమ్మల రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు ముత్యాల విశ్వనాథం, పాల్మంవంచ మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, పట్టణ కార్యదర్శి అడుసుమిల్లి సాయిబాబా, మండల సహాయ కార్యదర్శి గుండాల నాగరాజు, పట్టణ సహాయ కార్యదర్శి ఉప్పు శెట్టి రాహుల్ నాయకులు ఇట్టి వెంకట్రావు, కొంగర అప్పారావు, వేములపల్లి శ్రీనివాసరావు, ఆవుల సతీష్, వర్క అజిత్, బానోత్ రంజిత్, ఉండ్రాతి రవి, మన్యం వెంకన్న, ఇరుకులపాటి సుధాకర్, జక్కుల లింగేశ్వర్, ఎర్రగడ్డ ప్రభాకర్, చంచలపురి శ్రీనివాస్, సాయిలు శ్రీనివాస్, మేక రాంబాబు, నెట్ట అమృతరావు, ఎస్‌కే కాసిం, లాల్ సింగ్, బాలు, ముగ్గితే వెంకటముత్యం, బాద్ చెన్నయ్య, బానోత్ వినోద్, వజ్జా సత్యం, వడ్లకొండ మేరమ్మ, నెల్లెం వీరేష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment