న్యాయశాఖ ఉద్యోగి మృతి పట్ల సంతాపం

న్యాయశాఖ ఉద్యోగి మృతి పట్ల సంతాపం

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: కొత్తగూడెం జిల్లా కోర్టులో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఆర్. రుక్మిణి (58) ఆదివారం అకాలమరణం పొందిన విషయం తెలిసిందే. ఆమె మృతి పట్ల సోమవారం మధ్యాహ్నం కొత్తగూడెం న్యాయశాఖ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కోర్టు కాన్ఫరెన్స్ హాల్‌లో సంతాప సభ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాన జిల్లా న్యాయమూర్తి పాటిల్ వసంత్ మాట్లాడుతూ "రుక్మిణి ఎంతగానో సౌమ్యంగా, క్రమశిక్షణతో తన విధులు నిర్వర్తించారు. ఎవరినీ బాధ పెట్టకుండా, అందరితో సత్సంబంధాలు కలిగిన వ్యక్తి. ఆమె మృతి, వారి కుటుంబానికి తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని తెలిపారు.

జిల్లా న్యాయ సేవాధికారం కార్యదర్శి ఎం. రాజేందర్, స్పెషల్ జ్యూడిషల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ తదితరులు సంతాపం ప్రకటించారు.

ఈ సందర్భంగా బార్ ఉపాధ్యక్షులు జనపరెడ్డి గోపికృష్ణ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మోహన్ దాస్, న్యాయశాఖ ఉద్యోగులు రామి శెట్టి రమేష్, లగడపాటి సురేష్, నిమ్మల మల్లికార్జున, దీకొండ రవికుమార్, కోర్టు సిబ్బంది నరేష్, ప్రమీల, మీనాకుమారి పాల్గొన్నారు.

సభ ముగింపులో రుక్మిణి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, పాల్గొన్న ప్రతీ ఒక్కరు రెండు నిమిషాలు మౌనంగా పాటించారు.

Blogger ఆధారితం.