వాహనాల పన్నులు వెంటనే చెల్లించాలి: వరంగల్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ పురుషోత్తం
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: జిల్లాలో ఉన్న వాహనాలన్నింటికీ పన్నులు విధిగా చెల్లించాల్సిన అవసరం ఉందని వరంగల్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ పురుషోత్తం తెలిపారు. సోమవారం కొత్తగూడెం రవాణా శాఖ కార్యాలయాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలన్నింటినీ నిర్ణీత గడువులోపే పన్నులు చెల్లించాల్సిందేనని, లేనిపక్షంలో సంబంధిత వాహనదారులపై అపరాధ రుసుములు విధించబడతాయని స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రైవేటు విద్యాసంస్థలకు చెందిన బస్సులు కొత్త విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందు ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌తో పాటు పన్ను చెల్లింపులను పూర్తి చేయాలని సూచించారు.మున్సిపల్ వాహనాలు కూడా రోడ్డు పన్నులు తప్పనిసరిగా చెల్లించాలని, అలాగే ప్రభుత్వ వాహనాలన్నింటికీ గడువులోపు పన్నులు చెల్లించాల్సిన బాధ్యత ఉన్నదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి వెంకటరమణ, కొత్తగూడెం ఎంవీఐ మనోహర్, ఎంవీఐ నిర్మలారెడ్డి, భద్రాచలం ఎంవీఐ వెంకట పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Post a Comment