శ్రమదానం చేసిన మంత్రి పొంగులేటి, మీనాక్షి నటరాజన్

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: పాల్వంచ మండలం కిన్నెరసాని లోని గిరిజన బాలుర గురుకుల పాఠశాల ఆవరణలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామ్ రెడ్డి శనివారం ఉదయం శ్రమదానం చేశారు. ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి స్వయంగా పిచ్చిమొక్కలను తొలగించి, చెత్తను ఎత్తివేసి శుభ్రం చేశారు. ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఈ ప్రాంగణంలో మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచందర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Post a Comment