సీనియర్ కార్టూనిస్ట్ సుభానికి సినీ ప్రముఖుల ప్రశంసలు

సీనియర్ కార్టూనిస్ట్ సుభానికి సినీ ప్రముఖుల ప్రశంసలు

 జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం:  ప్రముఖ హాస్య మాసపత్రిక ‘హాస్యనందం’ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్టూన్ పోటీలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన సీనియర్ కార్టూనిస్ట్ షేక్ సుభాని ప్రత్యేక బహుమతి అందుకున్నారు. మానవ అవయవాల్లో ముక్కుకు ఉన్న ప్రాధాన్యతను హాస్యరసంతో కలగలిపి వినూత్నంగా చూపిన సుభానికి నిర్వాహకులు ప్రత్యేక బహుమతి ప్రకటించారు.

ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన బహుమతి ప్రదానోత్సవానికి ప్రముఖ సినీనటులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, తనికెళ్ల భరణి హాజరై షేక్ సుభానికి నగదు బహుమతిని అందజేశారు. సుభాని తన కార్టూన్ ద్వారా సామాజిక అంశాలను వినూత్నంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం అభినందనీయమని వారు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ‘హాస్యనందం’ మాసపత్రిక ఎడిటర్ రాము, తెలంగాణ కార్టూనిస్టుల వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జాకీర్, ప్రముఖ కార్టూనిస్టులు నరసి, బాచి, బన్ను తదితరులు పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 150 మందికి పైగా కార్టూనిస్టులు పోటీల్లో పాల్గొన్నారు.

Blogger ఆధారితం.