అతిగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 10 మందికి జరిమానాలు

అతిగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 10 మందికి జరిమానాలు

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం:  అతిగా మద్యం సేవించి వాహనాలు నడిపిన కేసుల్లో 10 మందికి జరిమానాలు విధిస్తూ బుధవారం కొత్తగూడెం స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ మెండు రాజమల్లు తీర్పు చెప్పారు.

కేసుల వివరాలు ఇలా ఉన్నాయి..కొత్తగూడెం వన్ టౌన్ ఎస్‌ఐ జి.విజయ కథనం ప్రకారం వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురిని ఆపి బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించగా మద్యం సేవించినట్లు నిర్ధారణ అయింది. నిందితులను కోర్టులో హాజరుపరచగా వారు నేరాన్ని ఒప్పుకోవడంతో మేజిస్ట్రేట్ జరిమానాలు విధించారు.

లక్ష్మిదేవిపల్లి ఎస్‌హెచ్‌ఓ జి.రమణారెడ్డి కథనం ప్రకారం ముగ్గురు వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న సమయంలో పట్టుబడినట్టు తెలిపారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో మద్యం సేవించినట్లు రుజువు కావడంతో కోర్టులో హాజరుపరచగా, నేరాన్ని ఒప్పుకున్న వారికి మేజిస్ట్రేట్ జరిమానాలు విధించారు. వారు జరిమానాలు చెల్లించారు.

పాల్వంచ ట్రాఫిక్ ఎస్ఐ జీవన్ రాజ్ పర్యవేక్షణలో వాహన తనిఖీలు నిర్వహించగా, నలుగురు వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో మద్యం తాగినట్లు తేలడంతో కోర్టుకు హాజరుపరచగా, నిందితులు నేరాన్ని ఒప్పుకోగా మేజిస్ట్రేట్ జరిమానాలు విధించారు. వారు జరిమానాలు చెల్లించారు.

Blogger ఆధారితం.