పహల్గాం ఉగ్రవాద దాడి మృతులకు న్యాయమూర్తుల సంతాపం

 

పహల్గాం ఉగ్రవాద దాడి మృతులకు న్యాయమూర్తుల సంతాపం

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం:  కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ అధ్యక్షతన బార్ అసోసియేషన్ లైబ్రరీ హాల్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన నూతన న్యాయమూర్తుల పరిచయ కార్యక్రమంలో జిల్లా జడ్జి వసంత్ పాటిల్ ముఖ్య అతిథిగా పాల్గొని, పహల్గాం ఉగ్రవాద దాడిలో మృతులకు సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ రెండు నిమిషాల పాటు న్యాయమూర్తులు, న్యాయవాదులు మౌనం పాటించి ఉగ్రవాదుల చేతిలో అమరులైన మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య అని, ఉగ్రవాదుల చర్యలను తీవ్రంగా ఖండించారు. అనంతరం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన న్యాయమూర్తులకు అభినందనలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి వసంత్ పాటిల్, మొదటి అదనపు జిల్లా జడ్జి ఎస్. సరిత, సినియర్ సివిల్ జడ్జి కె. కీరణ్ కుమార్, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఎం. రాజేందర్, జూనియర్ సివిల్ జడ్జి ఏ. సుచరిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె. సాయి శ్రీ, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి బి. రవి కుమార్, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ మెండు రాజమల్లు, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు జే. గోపి కృష్ణ, బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, సినియర్, జూనియర్, మహిళా న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.