బ్యాంక్ అధికారులతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సమీక్ష సమావేశం
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా జూన్ 9 నుండి 14వ తేదీ వరకు చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ నిర్వహించనుండటంతో, బ్యాంకు అధికారులు, ఆర్థిక సంస్థల ప్రతినిధులు, ప్రతివాదులు రాజీ మార్గంలో తమ కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ కోరారు.
మంగళవారం జిల్లా కోర్టు సమావేశ మందిరంలో బ్యాంకు అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ మెండు రాజమల్లు పాల్గొన్నారు.

Post a Comment