డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 9 మందికి జరిమానాలు

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 9 మందికి జరిమానాలు

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం:  మద్యం తాగి వాహనాలు నడిపిన తొమ్మిది మందికి జరిమానాలు విధిస్తూ కొత్తగూడెం స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ మెండు రాజమల్లు శుక్రవారం తీర్పు చెప్పారు.

వివరాల్లోకి వెళ్తే..కొత్తగూడెం వన్ టౌన్ ఎస్‌ఐ విజయ కథనం ప్రకారం వాహన తనిఖీ సమయంలో ఒకరిని ఆపి బ్రేత్ అనలైజర్ ద్వారా పరీక్షించగా అతను మద్యం తాగినట్టు రుజువైంది. కోర్టులో ప్రవేశపెట్టిన తరువాత నేరం ఒప్పుకోవడంతో మేజిస్ట్రేట్ జరిమానా విధించారు.

లక్ష్మిదేవిపల్లి ఎస్‌హెచ్‌ఓ జి. రమణారెడ్డి కథనం ప్రకారం ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి వాహనం నడుపుతుండగా బ్రీత్ అనలైజర్ పరీక్షలో మద్యం తాగినట్టు నిర్ధారణ అయింది. నేరాన్ని ఒప్పుకోవడంతో కోర్టు వారికి జరిమానా విధించగా, వారు జరిమానాలు చెల్లించారు.

ఇక పాల్వంచ టౌన్ ట్రాఫిక్ ఎస్ఐ జీవనరాజ్ పర్యవేక్షణలో నిర్వహించిన వాహన తనిఖీల్లో ఆరుగురు వ్యక్తులు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. పరీక్షలో మద్యం తాగినట్లు రుజువవ్వడంతో కోర్టులో ప్రవేశపెట్టారు. నేరాన్ని ఒప్పుకున్నందుకు వారికీ జరిమానాలు విధించడంతో పాటు, జిల్లా కోర్టు పరిసరాల్లో సామాజిక సేవలు నిర్వహించాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేశారు.

Blogger ఆధారితం.