ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి : అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం లక్ష్మీదేవిపల్లి మండలంలోని శెట్టిపల్లి, పాల్వంచ మండలంలోని రెడ్డిగూడెం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పౌర సరఫరా శాఖ అధికారులతో కలిసి సందర్శించి, కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు.
రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని ఆయన సూచించారు. త్రాగునీరు, టెంట్‌లు, తూకపు యంత్రాలు, తేమ కొలిచే యంత్రాలు, గన్ని బ్యాగులు, టార్పాలిన్‌లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన వెంటనే ధాన్యాన్ని కేటాయించిన మిల్లులకు తరలించాలని, ట్యాబ్ ఎంట్రీ ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలని సూచించారు.ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు అన్ని రకాల రిజిస్టర్లను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు ఆయన స్పష్టంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో పౌర సరఫరా శాఖ అధికారి రుక్మిణి, మేనేజర్ త్రినాథ్ బాబు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Post a Comment