SRBGNR ప్రభుత్వ కళాశాలలో బైక్ ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణ
జె.హెచ్.9. మీడియా, ఖమ్మం : టీజీఈజేఏసీ పిలుపు మేరకు ఈ నెల 25న ఖమ్మంలో నిర్వహించనున్న బైక్ ర్యాలీ, సదస్సును విజయవంతం చేయాలని కోరుతూ SRBGNR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోస్టర్, పాంప్లెట్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్. మాధవరావు మాట్లాడుతూ, జేఏసీతో సంబంధం ఉన్న అన్ని భాగస్వామ్య సంఘాలు ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఖమ్మం బైక్ ర్యాలీకి SRBGNR కళాశాల నుండి విశేషంగా పాల్గొననున్నట్లు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టీజీవో హౌస్ బిల్డింగ్ సొసైటీ కార్యదర్శి డాక్టర్ పి. విజయకుమార్, కళాశాల విద్య సంఘ బాధ్యులు కే. కిరణ్ కుమార్, డాక్టర్ ఓంకార్, డాక్టర్ కరీం, డాక్టర్ బి. శ్రీనివాస్, డాక్టర్ కార్తీక్, డాక్టర్ చెంచురత్తయ్య, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ శ్రీనివాస సరీన్, డాక్టర్ అనిత, కోటమ్మ, బి. వెంకటేశ్వర్లు, డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ కవిత, ఇంద్రాణి, ధర్మయ్య, టీఎన్జీవో సంఘం బాధ్యులు రాజు, ఏ. దేవేందర్, విజయ్, శ్రీనివాస్, గెస్ట్ ఫ్యాకల్టీ సంఘం బాధ్యులు బి. అప్పారావు, అభిజిత్, డాక్టర్ వీరన్న, డాక్టర్ శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, అవుట్సోర్సింగ్ సంఘం బాధ్యులు ప్రభాకర్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment