ప్రభుత్వ దవాఖానాల్లో సకల సౌకర్యాల కల్పనకు నిరంతర కృషి - ఎమ్మెల్యే
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: ప్రభుత్వ దవాఖానాల్లో సకల వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. సోమవారం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి (CHC)లో రూ.1 కోటి నిధులతో ఏర్పాటైన ఆధునిక ఆర్థోపెడిక్, ఇ.ఎన్.టి., డెంటల్, కంటి, ఓపీడీ, ఆపరేషన్ థియేటర్లను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూపేదలకు ప్రభుత్వ వైద్యం మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు. కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలను పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. విద్య, వైద్య రంగాలకే తాను మొదటి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి సముచిత వైద్యం అందించేందుకు వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డీసీఎచ్‌ఎస్ డాక్టర్ రవిబాబు, తహసీల్దార్ వివేక్, మున్సిపల్ కమిషనర్ కె. సుజాత, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాంప్రసాద్, డాక్టర్ సోమరాజు దొర, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు ముత్యాల విశ్వనాథం, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నూకల రంగారావు, కొండా వెంకన్న, బండి నాగేశ్వరరావు, ఉప్పుశెట్టి రాహుల్, గుండాల నాగరాజు, డీ. సుధాకర్, అన్నారపు వెంకటేశ్వర్లు, శనగారపు శ్రీనివాసరావు, మనేం వెంకన్న, నరహరి నాగేశ్వరరావు, బానోత్ రంజిత్, రవి, భూక్య విజయ్ కుమార్, వేములపల్లి రాజశేఖర్, పైడిపల్లి దుర్గా మహేష్, కుమార్ రాజు, విజయ్, రాము, శాంత వర్ధన్, సుమ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Post a Comment