పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో కొత్త వైద్య సదుపాయాలు ప్రారంభం

పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో కొత్త వైద్య సదుపాయాలు ప్రారంభం

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం:   పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా మంజూరైన ఆధునిక వైద్య పరికరాలు ప్రజల సేవలోకి వచ్చాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. చెవి, ముక్కు, గొంతు, దంత, కంటి, ఎముకలు, కీళ్ళ విభాగాలకు సంబంధించిన ఓపీ మరియు శస్త్రచికిత్సలకు అవసరమైన పరికరాలు ఆసుపత్రిలో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

ఇటీవల స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా ఈ సదుపాయాలను ప్రారంభించినట్టు కలెక్టర్ తెలిపారు. నూతన పరికరాల ద్వారా మోకాళ్ల కీళ్ళ మార్పిడి వంటి శస్త్రచికిత్సలు, విరిగిన ఎముకల చికిత్సలు సమర్థవంతంగా నిర్వహించగలమన్నారు.

కంటి సంబంధిత పూర్తి స్థాయి ఓపీ సేవలు, చెవి, ముక్కు, గొంతు విభాగాల వైద్య పరీక్షలు, ఆపరేషన్లు, దంత విభాగానికి సంబంధించిన అన్ని రకాల శస్త్రచికిత్సలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

Blogger ఆధారితం.