బాధ్యతలు స్వీకరించిన న్యాయమూర్తులు

బాధ్యతలు స్వీకరించిన న్యాయమూర్తులు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం:   తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొదటి అదనపు జిల్లా జడ్జిగా ఎస్. సరిత పదవి బాధ్యతలు చేపట్టారు. ప్రిన్సిపల్ జిల్లా అండ్ సెషన్స్ జడ్జి పాటిల్ వసంత్ నుండి ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికే సికింద్రాబాద్ ఫ్యామిలీ కోర్టులో విధులు నిర్వహిస్తున్న ఆమె, బదిలీపై కొత్తగూడెం చేరుకున్నారు.

అలాగే, కే. కిరణ్ కుమార్ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా సత్తుపల్లి సీనియర్ సివిల్ జడ్జి మీరా ఖాసీం నుండి ఆయన పదవిబాధ్యతలు చేపట్టారు. వీరు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో మొదటి అదనపు జడ్జిగా పనిచేశారు. ఈ ఇద్దరు న్యాయమూర్తులు బుధవారం బాధ్యతలలో చేరగా  రెండోవ అదనపు జ్యూడిషియల్ సెకండ్ క్లాస్  మెజిస్ట్రేట్ కే. సాయి శ్రీ, కొత్తగూడెం  స్పెషల్ జ్యూడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బాగం మాధవరావు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు మోహన్ దాస్, కిరణ్ కుమార్, జిల్లా న్యాయశాఖ అధ్యక్షుడు రామిశెట్టి రమేష్, నిమ్మల మల్లికార్జున్ శుభాకాంక్షలు తెలిపారు.

Blogger ఆధారితం.