డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో మందు బాబులకు జరిమానా
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో మందు బాబులకు జరిమానాలు విధిస్తూ కొత్తగూడెం స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు మంగళవారం తీర్పు చెప్పారు.
పాల్వంచ టౌన్ ఎస్‌ఐ డి. రాఘవయ్య వాహన తనిఖీలు నిర్వహించగా, ఒక వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతుండగా పట్టుబడ్డాడు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో మద్యం సేవించినట్లు రుజువై, అతడిని కోర్టులో హాజరుపరిచారు. నేరం అంగీకరించడంతో అతనికి జరిమానా విధించారు.
అలాగే, కొత్తగూడెం రెండవ టౌన్ ఎస్‌హెచ్‌ఓ టీ. రమేష్ కుమార్ తనిఖీల్లో మరో వ్యక్తి మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో మద్యం సేవించినట్లు నిరూపితమై, అతడిని కోర్టులో హాజరుపరిచారు. నేరం అంగీకరించడంతో జరిమానా విధించారు.
కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్‌ఐ కె. నరేష్ తనిఖీల్లో ఏకంగా ఏడుగురు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిని కోర్టులో హాజరుపరచగా, నేరం అంగీకరించిన వారందరికీ జరిమానాలు విధించారు.
లక్ష్మీదేవిపల్లె ఎస్‌ఐ జి. రమణారెడ్డి తనిఖీలు చేపట్టగా, ఒక వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు బ్రీత్ ఎనలైజర్ ద్వారా రుజువైంది. అతడిని కోర్టులో హాజరుపర్చగా, నేరాన్ని అంగీకరించడంతో జరిమానా విధించారు..

Post a Comment