భూక్య రేణుకకు డాక్టరేట్
జె.హెచ్.9. మీడియా, పాల్వంచ: జ్యోతిష్య శాస్త్రంలో విశేష పరిశోధనలు నిర్వహించిన పాల్వంచకు చెందిన భుక్య రేణుక డాక్టరేట్ అందుకున్నారు. ఈనెల 20న విశాఖపట్నం సమీపంలోని సింహాచలంలో నిర్వహించిన జాతీయ స్థాయి మెగా జ్యోతిష్య సదస్సులో ఆమెకు డాక్టరేట్ ను అందజేశారు. వివాహం, సంతాన సంబంధిత అంశాలపై గణనీయమైన పరిశోధనలు చేసినందుకుగాను ఆర్యన్ రీసెర్చ్ యూనివర్సిటీ (NS Live Astro) వ్యవస్థాపకులు డా. నరసింహ స్వామి చేతులమీదుగా ఆమెకు డాక్టరేట్ ప్రదానం చేశారు.
జ్యోతిష్య సేవలలో చేసిన కృషిని గుర్తించి శుక్రాచార్య వేదాంగ వర్చువల్ యూనివర్శిటీ ఆఫ్ ఇండియా తరఫున ‘ఆచార్య’ బిరుదుతో భుక్య రేణుకను ఘనంగా సత్కరించారు. భుక్య రేణుక భర్త భుక్య హిరణ్ గాంధీ నీటిపారుదల శాఖలో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఈ సందర్భంగా భుక్య రేణుక మాట్లాడుతూ... ఆధునిక జీవనశైలిలో మనుషులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు మూలకారణాలైన గ్రహస్థితుల గురించి అవగాహన కల్పించేందుకు భవిష్యత్‌లో మరింత సేవా కార్యక్రమాలు చేపడతానని సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Post a Comment