డీసీఎచ్‌ఎస్ రవిబాబును సత్కరించిన ఎమ్మెల్యే కూనంనేని
జె.హెచ్.9. మీడియా, పాల్వంచ: కొత్తగూడెం జిల్లా వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో మెరుగైన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో విశేష కృషి చేసిన జిల్లా డీసిహెచ్ఎస్ డాక్టర్ బి. రవిబాబు ఇటీవల డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం పాల్వంచ ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ఆయనను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేద ప్రజలకు జిల్లాలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రావడం హర్షణీయమని పేర్కొన్నారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు నిష్ఠతో పనిచేయాలని సూచించారు.
కార్యక్రమంలో పాల్వంచ తహసిల్దార్ వివేక్, మున్సిపల్ కమిషనర్ కె. సుజాత, ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రాంప్రసాద్, డాక్టర్ సోమరాజు దొర, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నూకల రంగారావు, సీపీఐ నాయకులు ఉప్పుశెట్టి రాహుల్, గుండాల నాగరాజు, డీ. సుధాకర్, అన్నారపు వెంకటేశ్వర్లు, శనగారపు శ్రీనివాసరావు, మనేం వెంకన్న, నరహరి నాగేశ్వరరావు, బానోత్ రంజిత్, రవి, భూక్య విజయ్ కుమార్, వేములపల్లి రాజశేఖర్, కాంగ్రెస్ నాయకులు కుమార్ రాజు విజయ్, సుమ తదితరులు పాల్గొన్నారు.
.webp)
Post a Comment