పాల్వంచ సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షల శిబిరం

పాల్వంచ సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షల శిబిరం
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: పాల్వంచ సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో  పోలీసు సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు ఉచిత కంటిచూపు పరీక్ష శిబిరం గురువారం నిర్వహించారు. జిల్లా పోలీసు అధికారి రోహిత్ రాజు ఆదేశాల మేరకు, పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్ పర్యవేక్షణలో పాల్వంచ పోలీసు స్టేషన్ ఆవరణలో ఈ శిబిరం నిర్వహించబడింది.

శరత్ మాక్సివిజన్ నేత్రవైద్యశాల సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో, దాదాపు 150 మందికి పైగా కంటిచూపు పరీక్షలు నిర్వహించుకున్నారు.

ఈ సందర్భంగా పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్ మాట్లాడుతూ శరీరంలో కళ్ళు అత్యంత ప్రాధాన్యమైనవని, కంటిచూపు కాపాడుకోవడం వల్లే మన దినచర్యలు నిరాటంకంగా సాగుతాయన్నారు. పోలీసు సిబ్బంది ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

ఈ శిబిరంలో పాల్వంచ సర్కిల్ అధికారి సతీష్, ఎస్సై లు  సుమన్, బిక్షం, రాఘవ, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


Blogger ఆధారితం.