కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
ఈ సందర్భంగా లక్కినేని సత్యనారాయణ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే ఆధునిక సామాజిక ఉద్యమ కారుడు అని, సమానత్వం కోసం ఆయన చేసిన సేవలు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. న్యాయవాదులు మారపాక రమేష్, కిలారు పురుషోత్తం, కటకం పుల్లయ్య, యసా యుగేందర్ తదితరులు ప్రసంగించి పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గోపి కృష్ణ, కార్యదర్శి మాధవ రావు, కార్యవర్గ సభ్యులు పార్వతి, రమేష్, చిన్ని కృష్ణ, అరుణ్, సినియర్ న్యాయవాదులు పురుషోత్తమరావు, బాబురావు, ఉదయ్ భాస్కర్, మనోహర్ రావు, రమేష్ కుమార్ మక్కడ్, కొదుమురి సత్యనారాయణ, విజయ భాస్కర్ రెడ్డి, సాదిక్ పాషా, కామేష్, సునీల్, సామంత్, అనుదీప్, అన్నపూర్ణ, ఎస్కే షాజహాన్ పర్వీన్ ,శాంత, నీలావేణి, శ్వేత తదితరులు పాల్గొన్నారు.


Post a Comment