పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు

పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం (లీగల్) : చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడిన పోక్సో నిందితుడికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ భద్రాద్రికొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ గురువారం తీర్పు ఇచ్చారు.

కేసు వివరాలు ఇలా..ఇల్లందు మండలం తంగేళ్లగడ్డకు చెందిన భూక్య నాగేశ్వరరావు అలియాస్ నాగేష్ 2024 జూలై 4న తన బంధువులైన ఆరు, నాలుగు సంవత్సరాల బాలికలను చాక్లెట్ ఇస్తానంటూ మాయ చేసి ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారుల అరుపులతో అతడు పరారయ్యాడు.ఆరోజు బాధిత బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇల్లందు పోలీసులు కేసు నమోదు చేశారు.

నిందితుడిపై కేసును అప్పట్లో ఇల్లందు ఇంచార్జి డిఎస్పీగా ఉన్న షేక్ అబ్దుల్ రెహమాన్    విచారించాగా,  అనంతరం డీఎస్పీ ఎం. చంద్రబాను పకడ్బందీగా దర్యాప్తు చేపట్టి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. కేసులో 15 మంది సాక్షులను ప్రాసిక్యూషన్ తరఫున హాజరుపరిచి వాదనలు వినిపించారు.

నేరం రుజువుకావడంతో న్యాయమూర్తి భూక్య నాగేశ్వరరావుకు జీవిత ఖైదుతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధించారు. కేసు వాదనలను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెలగల నాగిరెడ్డి, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పివిడి లక్ష్మి ముందుండి నడిపించారు. విచారణలో లీగల్ ఆఫీసర్ గద్దాడ శిరీష, నోడల్ ఆఫీసర్ జి. ప్రవీణ్ కుమార్, లైజాన్ ఆఫీసర్ ఎస్‌కే అబ్దుల్ ఘని, కోర్టు డ్యూటీ పీసీ తాళ్లూరి శ్రీనివాసరావు తదితరులు సహకరించారు.

Blogger ఆధారితం.