పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ ఇంగ్లీష్ దినోత్సవ వేడుకలు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో బుదవారం షేక్స్పియర్ జయంతి, అంతర్జాతీయ ఇంగ్లీష్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పి. పద్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఇంగ్లీష్ భాష ఒక అంతర్జాతీయ భాషగా, ప్రతీ విద్యార్థి తప్పనిసరిగా దీన్ని నేర్చుకోవాలని ఆకాంక్షించారు.
ఇంగ్లీష్ విభాగాధ్యక్షురాలు డాక్టర్ టి. అరుణ కుమారి మాట్లాడుతూ ఇంగ్లీష్ భాష నేర్చుకుంటే ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉంటుందన్నారు. వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జె. మాధవి మాట్లాడుతూ ప్రతి వారంలో ఒక రోజును ప్రత్యేకంగా ఇంగ్లీష్ మాట్లాడే రోజుగా కేటాయించుకోవాలని సూచించారు.
ఇంగ్లీష్ లెక్చరర్ సి. లీలా సౌమ్య మాట్లాడుతూ షేక్స్పియర్ జీవిత చరిత్ర కవులకు ఆదర్శంగా నిలుస్తుందని, ఆయన రచనలు సమకాలీన ప్రజలకు ఎంతో విలువైనవని పేర్కొన్నారు. లెక్చరర్ భాను ప్రవీణ్ మాట్లాడుతూ ఇంగ్లీష్ భాషను సామాన్యుల వరకూ తీసుకురావడంలో షేక్స్పియర్ గారికి అపారమైన కృషి ఉందని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు అధ్యాపక బృందానికి చెందిన డాక్టర్ కామేశ్వరరావు, డాక్టర్ స్వరూప రాణి, డాక్టర్ శ్రీదేవి, పి. శ్రీనివాస్, పారెల్లి శ్రీనివాస్, కె. రాంబాబు, షహనాజ్ ఖాన్, దీపిక, హారిక, పర్వీన్, విమల, రమేష్, పవన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంగ్లీష్ భాషపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పిపిటీ (PPT) ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.

Post a Comment