మద్యం సేవించి వాహనాలు నడిపిన 16 మందికి కోర్టు జరిమానా
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: మద్యం సేవించి వాహనాలు నడిపిన 16 మందికి జరిమానా విధిస్తూ కొత్తగూడెం స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ మెండు రాజమల్లు గురువారం తీర్పు వెల్లడించారు.
కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్ఐ నరేష్ కథనం ప్రకారం, ఇటీవల వాహన తనిఖీల సమయంలో తొమ్మిది మంది మద్యం సేవించి వాహనాలు నడిపినట్టు నిర్ధారణ కావడంతో వారికి సంబంధించి కేసులను కోర్టులో ప్రవేశపెట్టారు. మద్యం సేవనాన్ని బ్రీత్ ఎనలైజర్ పరీక్షల ద్వారా రుజువు చేశారు.
ఇక పాల్వంచ పట్టణంలో ఎస్‌హెచ్‌ఓ కే. సుమన్ పర్యవేక్షణలో నిర్వహించిన వాహన తనిఖీలలో మరో ఏడుగురు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారికీ కూడా బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించి కోర్టుకు హాజరుపరచగా, నేరాన్ని ఒప్పుకోవడంతో మేజిస్ట్రేట్ మెండు రాజమల్లు జరిమానాలు విధించగా, సంబంధిత వ్యక్తులు జరిమానాలు చెల్లించారు.

Post a Comment