శ్రీ సీతారామ కళ్యాణంలో మెజిస్ట్రేట్ రాజమల్లు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : కొత్తగూడెం పట్టణంలోని ప్రగతి నగర్ శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పురోహితులు కొండవీటి దత్తాత్రేయ శర్మ, కొండవీటి కార్తికేయ, కప్పర్తి శర్మ, హన్మధాదిత్య బృందం ఆధ్వర్యంలో వేడుకలు సంప్రదాయబద్ధంగా జరిగాయి.
కళ్యాణ మహోత్సవానికి కొత్తగూడెం స్పెషల్ జ్యూడిషల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ మెండు రాజమల్లు దంపతులు, ఆలయ కమిటీ అధ్యక్షుడు మేరెడ్డి జనార్దన్ రెడ్డి, సీనియర్ న్యాయవాది జీ.వి.కే. మనోహర రావు, మద్దినేని వెంకటేశ్వర్లు, రవి, ఇల్ల నాగేశ్వరరావు, గునిపాటి పుష్పలత, రమ్య, భాగ్యలక్ష్మి తదితరులు హాజరయ్యారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కళ్యాణోత్సవాన్ని తిలకించారు.

Post a Comment