అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కరపత్రం విడుదల

అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కరపత్రం విడుదల
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  పాల్వంచ మండలం నాగారం రేపల్లెవాడ గ్రామ యువకులు జ్ఞాన చైతన్య అంబేద్కర్ జ్ఞాన వారసుల ఆధ్వర్యంలో ఈ నెల 13న జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ చేతుల మీదుగా నూతన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

 కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆదివారం పాత పాల్వంచ లో  తెలంగాణ బహుజన ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ దేవదానం చేతుల మీదుగా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో కేటీపీఎస్ డీఈ వరికూటి శ్రీనివాసరావు, జర్నలిస్టులు శనగ రామచందర్ రావు, బర్ల వెంకట్రావ్, వంగూరి రవి, నిమ్మల సత్యనారాయణ, కమిటీ సభ్యులు బాసిబోయిన దుర్గ, యాదాల సీతారాములు, తోకల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.