డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో పలువురు వ్యక్తులకు జరిమానాలు
వివరాలలోకి వెళ్తే.. పాల్వంచ టౌన్ ఎస్‌ఐ డి. రాఘవయ్య వాహన తనిఖీలు చేపట్టిన సందర్భంలో ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో మద్యం సేవించినట్లు రుజువుకాగా, వారిని కోర్టులో హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు విచారణ అనంతరం ఈ ఇద్దరికి జరిమానాలు విధించారు.
ఇక లక్ష్మీదేవిపల్లి ఎస్‌ఐ జి. రమణారెడ్డి వాహన తనిఖీలు నిర్వహించిన సమయంలో నలుగురు వ్యక్తులు మద్యం తాగిన స్థితిలో వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షించగా మద్యం సేవించినట్లు నిర్ధారణ కావడంతో, వారిని కోర్టులో హాజరుపరిచి న్యాయాధికారి ముందుకు తీసుకెళ్లారు. విచారణ అనంతరం మెజిస్ట్రేట్ నలుగురికీ జరిమానాలు విధించారు.

Post a Comment