ఈనెల 12న పెద్దమ్మతల్లి గుడిలో చండీహోమం
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : పౌర్ణమి సందర్భంగా ఈనెల 12న శనివారం రోజున పాల్వంచ శ్రీ కనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మగుడి)లో చండీహోమం ఆచారసంప్రదాయాల నడుమ వేడుకగా నిర్వహించనున్నారు.ఈ పవిత్ర చండీహోమంలో పాల్గొనదలచిన భక్తులు ముందుగా గానీ, అదే రోజు గానీ రూ. 2,516 చెల్లించి టికెట్ పొంది గోత్రనామాలను నమోదు చేయించుకోవచ్చు.
చండీహోమంలో పాల్గొన్న దంపతులకు శేషవస్త్రాలు, ప్రసాదాలతో పాటు ఉచిత అన్నప్రసాదం అందజేయనున్నారు. ప్రత్యక్షంగా హాజరుకాలేని భక్తుల పేర్లతో కూడిన సంకల్పం చేసుకొని హోమం నిర్వహించబడుతుంది. హోమంలో పాల్గొనేవారు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులు ధరించాలి. పురుషులు ధోతి, కండువా ధరించాలి. మహిళలు చీరకట్టుతో హాజరుకావలసి ఉంటుంది. వివరాలకు 6303408458 నంబరుకు సంప్రదించవచ్చని దేవస్థానం కార్యనిర్వాహణాధికారి ఎన్ రజనీకుమారి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Post a Comment