కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై, అంబేద్కర్ జీవిత విశేషాలను వివరించారు . విదేశాల్లో ఎకనామిక్స్‌లో డాక్టరేట్ పొందిన తొలి భారతీయుడిగా, స్వాతంత్ర్యానంతరం భారత తొలి న్యాయశాఖ మంత్రిగా, రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఛైర్మన్‌గా అంబేద్కర్ పోషించిన పాత్ర అపూర్వమని పేర్కొన్నారు.
64 సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీలు పొందిన అంబేద్కర్ తన కాలంలో అత్యంత విద్యావంతుడిగా, అణగారిన వర్గాల హక్కుల కోసం అహర్నిశలు కృషిచేసిన ఆయన సేవలు భారత సమాజానికి దిక్సూచిగా నిలిచాయని వివరించారు. అనంతరం బార్ సభ్యులు అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జె. గోపికృష్ణ, ప్రధాన కార్యదర్శి భాగం మాధవరావు, క్రీడల కార్యదర్శి ఉప్పు అరుణ్, కోశాధికారి కె. చిన్నికృష్ణ, గ్రంథాలయ కార్యదర్శి మాలోత్ ప్రసాద్‌తో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

Post a Comment