త్రివేణి టాలెంట్ స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం:కొత్తగూడెంలోని త్రివేణి టాలెంట్ స్కూల్ లో చదువుకున్న 10వ తరగతి 2002-2003 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సోమవారం పాల్వంచ లోని హిల్ వ్యూ రిసార్ట్‌లో ఉత్సాహంగా జరిగింది. చిన్ననాటి స్నేహితులందరూ 22 ఏళ్ల తర్వాత ఒక్కచోట చేరి ఆనందంగా గడిపారు. అప్పటి జ్ఞాపకాలను తలుచుకుంటూ పాఠశాలలో గడిపిన క్షణాలు గుర్తు చేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు.
కార్యక్రమానికి స్కూల్ డైరెక్టర్ వీరేందర్ చౌదరి గొల్లపూడి, ప్రిన్సిపాల్ మురళి, తెలుగు టీచర్ మోహనా చారి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అప్పట్లో విద్యార్థుల్లో ఉన్న క్రమశిక్షణ, వినయ విధేయతలు, భయభక్తులు ఈ తరం విద్యార్థుల్లో కనిపించడం లేదన్నారు. తాము బోధించిన విద్యార్థులు ఇప్పుడు మంచి స్థాయిలో ఉండటం గర్వంగా ఉందని తెలిపారు.
ఈ పూర్వ విద్యార్థుల సమావేశంలో ఉప్పుశెట్టి రాకేష్, మల్లెల వంశీ, ధర్మపురి వంశీ, నరేష్, వినయ్, అరుణ్, కళ్యాణ్ చక్రవర్తి, చక్రవర్తి సాయి సందీప్, తేజ, సత్యమూర్తి, శశాంక్, ఫానిత, మాధురి, జోష్ణ, కవిత తదితరులు పాల్గొన్నారు.

Post a Comment