ఉగ్రవాదులను ఉరితీయాల్సిందే - పాల్వంచ జమా మస్జిద్ కమిటీ

ఉగ్రవాదులను ఉరితీయాల్సిందే - పాల్వంచ జమా మస్జిద్ కమిటీ

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: పాల్వంచ జమా మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో పహెల్గాం ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ శుక్రవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మస్జిద్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ మనిషిని చంపమని ఏ ధర్మమూ చెప్పదని, అలా కాకుండా, మనుషులను ఎవరైతే హతమారుస్తారో వారు ఇస్లాం ధర్మ వ్యతిరేకులని, వారిని అల్లా క్షమించడని, అమాయకమైన ప్రజలపై దాడి చేసి హతమార్చిన ఉగ్రవాదులను ముమ్మాటికీ బహిరంగంగా ఉరి తీయాల్సిందేనని అన్నారు.

ఈ కార్యక్రమంలో జమా మస్జిద్ కమిటీ అధ్యక్షుడు ఫయాజుల్ హస్సన్, కార్యదర్శి ఇబ్రహీం ఖురేషి, ఖాజా అహ్మద్, అక్బర్, మస్తాన్ ఖురేషి, ఫక్రుద్దీన్, రహీమ్, ఫారూఖ్, హన్ను, మత గురువులు మరియు ముస్లిం సోదరులు పాల్గొన్నారు.


Blogger ఆధారితం.