జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా ఎం.రాజేందర్

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా ఎం.రాజేందర్

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం:  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా ఎం. రాజేందర్ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్‌ను మర్యాదగా కలిసిన రాజేందర్ మొక్కను బహూకరించారు.

ఇంతకుముందు ఆయన మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌గా విధులు నిర్వహిస్తూ బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎం.రాజేందర్ మాట్లాడుతూ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ప్రజలకు న్యాయ సేవలు మరింత విస్తృతంగా అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. సేవా కార్యక్రమాల ప్రభావాన్ని పెంచే దిశగా నూతన కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తామని పేర్కొన్నారు.

Blogger ఆధారితం.