జర్నలిస్ట్ చవ్వ సంతోష్‌కు సేవారత్న అవార్డు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో జరిగిన ప్రతిభారత్న అవార్డుల ప్రదానోత్సవంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన జర్నలిస్టు చవ్వ సంతోష్‌కు సేవారత్న అవార్డు లభించింది.
సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నేత ఉప్పల శ్రీనివాస్, హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ జాతీయ అధ్యక్షుడు కొంపల్లి సత్యనారాయణ, రిటైర్డ్ జిల్లా జడ్జి, సుప్రీంకోర్టు న్యాయవాది నేరేళ్ల మల్యాద్రి, చీరెల్లి చంద్రశేఖర్ గుప్తా ముఖ్య అతిథులుగా హాజరై, వివిధ రంగాల్లో విశేష సేవలందిస్తున్న పలువురు సేవకులను సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమాజసేవకులకు అవార్డుల ప్రదానం వారిని మరింత ప్రజల సేవలవైపు దూకించేలా చేస్తుందని పేర్కొన్నారు. సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ, సేవాకార్యకర్తలను గుర్తించి పురస్కరించడంలో ముందుండే హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ కార్యాచరణ అభినందనీయమని తెలిపారు.
జర్నలిస్టుగా ప్రజా సమస్యలపై పట్టుదలతో పనిచేస్తూనే సేవా సంఘం ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన చవ్వ సంతోష్‌కు ఈ అవార్డు లభించిందని నిర్వాహకులు పేర్కొన్నారు. సేవారత్న అవార్డును రవీంద్రభారతిలో అందుకోవడం గర్వకారణమని పేర్కొంటూ, ఆయన భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

Post a Comment