పాల్వంచ..స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం…కార్లు దగ్ధం

పాల్వంచ..స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం…కార్లు దగ్ధం

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం:  పాల్వంచ లో శనివారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తెలంగాణ నగర్ సమీపంలోని ఓ స్క్రాప్ దుకాణంలో వాహనాలను గ్యాస్ కట్టర్‌తో కట్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించి పక్కనే నిలిపివున్న పది కార్లను పూర్తిగా భస్మం చేశాయి.

ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో అక్కడ పనిచేస్తున్న వారంతా సురక్షితంగా బయటపడటం తో ప్రాణాపాయం తప్పినట్లు తెలిసింది.

ఇకపోతే ఈ ప్రాంతంలో అనుమతులు లేకుండానే స్క్రాప్ దుకాణాలు అనేకం నడుస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు ఏమాత్రం పాటించకుండానే ఇటువంటి కార్యకలాపాలు సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో స్క్రాప్ యజమానులు రెచ్చిపోతున్నారని మండిపడుతున్నారు. వెంటనే చర్యలు తీసుకోకుంటే మరింత పెద్ద ప్రమాదాలు సంభవించే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.

Blogger ఆధారితం.