ఐఎన్టీఎస్ఓ ఫలితాల్లో సత్తా చాటిన శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు

ఐఎన్టీఎస్ఓ ఫలితాల్లో సత్తా చాటిన శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  పాల్వంచ పట్టణ పరిధి కాంట్రాక్టర్స్ కాలనీలోని శ్రీ చైతన్య హై స్కూల్ విద్యార్థులు అంతర్జాతీయ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్ ఫైనల్‌ లెవెల్‌ ఫలితాల్లో ప్రతిభను చాటారు. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో 96 మంది విద్యార్థులు విజయం సాధించి పాఠశాల పేరు ప్రముఖంగా నిలిపారు.

శ్రీ చైతన్య స్కూల్లో 6వ తరగతి చదువుతున్న కోనిక శ్రీ గ్రాండ్ ప్రైజ్‌గా ల్యాప్‌టాప్‌, ఏడవ తరగతి విద్యార్థి రిషిత ఫస్ట్ ప్రైజ్‌గా "టాబ్లెట్ ఫోన్" గెలుచుకుంది. అదనంగా ఒక ద్వితీయ బహుమతి, రెండు తృతీయ బహుమతులు, రెండు నాలుగవ బహుమతులు, ఒక ఐదవ బహుమతిని ఇతర విద్యార్థులు అందుకున్నారు. మిగతా విజేతలు మెడల్స్‌, సర్టిఫికెట్లు అందుకున్నారు.

విజేతలైన విద్యార్థులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాధికారి వెంకటేశ్వరాచారి బహుమతులతో ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల ఏజీఎం జయప్రకాశ్, హై స్కూల్ కోఆర్డినేటర్ వెంకట్, ప్రిన్సిపల్ రమ్య, డీన్ మధు, సీఈ ఇన్‌చార్జ్ నాగబాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.