డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన 10 మందికి జరిమానా

డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన 10 మందికి జరిమానా

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ, రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన 10 మంది వ్యక్తులకు కొత్తగూడెం సెకండ్ క్లాస్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు జరిమానాలు విధించారు.

లక్ష్మీదేవిపల్లె ఎస్‌ఐ జి. రమణారెడ్డి వాహన తనిఖీలు నిర్వహించగా, ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో బయటపడింది. వారిని కోర్టుకు హాజరు పరిచగా జరిమానాలు విధించాయి.

అలాగే, కొత్తగూడెం వన్ టౌన్ ఎస్‌ఐ విజయ తనిఖీల సమయంలో ఎనిమిది మంది వ్యక్తులు వాహనాల రాకపోకలకు అడ్డంగా నిలిచినట్లు గుర్తించి, వారిపై కేసులు నమోదు చేసి కోర్టుకు పంపారు. విచారణ అనంతరం వారికి కూడా జరిమానాలు విధించారు.

Blogger ఆధారితం.