అతిగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 20 మందికి జరిమానా

 

అతిగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 20 మందికి జరిమానా

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం:  కొత్తగూడెం కోర్టులో స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ మెండు రాజమల్లు తీర్పు ద్వారా మద్యం తాగి వాహనాలు నడిపిన 20 మందికి శుక్రవారం జరిమానా విధించారు.

కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్‌ఐ నరేష్ కథనం మేరకు వాహన తనిఖీల సమయంలో తొమ్మిది మందిని బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షించగా మద్యం సేవించినట్టు రుజువై, న్యాయస్థానానికి హాజరు పరచగా వారు నేరం ఒప్పుకున్నారు. దీంతో మేజిస్ట్రేట్ వారికి జరిమానా విధించారు.

అదేవిధంగా, కొత్తగూడెం మూడో టౌన్ ఎస్‌ఐ పురుషోత్తం తనిఖీలు నిర్వహిస్తుండగా మద్యం సేవించిన ముగ్గురు వ్యక్తులు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో తప్పుచేసినట్టు వెల్లడై, కోర్టుకు హాజరై నేరాన్ని ఒప్పుకోవడంతో జరిమానా విధించగా వారు చెల్లించారు.

పాల్వంచ టౌన్ ఎస్‌ఐ డి. రాఘవయ్య పర్యవేక్షణలో వాహన తనిఖీలు నిర్వహించగా ఎనిమిది మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్టు పట్టుబడ్డారు. వీరిని బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షించగా మద్యం తాగినట్టు నిర్ధారణ కావడంతో న్యాయస్థానంలో ప్రవేశపెట్టి విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు. దీంతో జరిమానాలు విధించగా సంబంధితులు చెల్లించారు.


Blogger ఆధారితం.