విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి శుక్రవారం వేపలగడ్డ, సుజాతనగర్‌లోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్‌లో నిర్వహించిన న్యాయ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.
పదవ తరగతి పరీక్షలలో విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు. అనంతరం న్యాయమూర్తి హాస్టల్‌ను తనిఖీ చేసి నిర్వహణ, సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో హాస్టల్ ప్రిన్సిపల్ బ్యూలా రాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Post a Comment