పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ కవితా దినోత్సవ వేడుకలు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) లో ప్రపంచ కవితా దినోత్సవాన్ని శుక్రవారం ఇంగ్లీష్ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పి. పద్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు పొందేందుకు ఆంగ్లభాషను నేర్చుకోవడం ఎంతో ఉపయోగకరమని ఆమె పేర్కొన్నారు.
కార్యక్రమంలో విద్యార్థులు కవితల ద్వారా సామాజిక వికాసానికి ఇంగ్లీష్ కవులు చేసిన సేవలను వివరించారు. రేష్మ, జీవన్ కుమార్ లు పి.పి.టి ద్వారా షేక్స్పియర్ జీవితాన్ని వివరించగా, విద్యార్థి అర్జున్ ప్రపంచ కవితా దినోత్సవ ప్రాముఖ్యతను ఆంగ్లంలో వివరించాడు. సునంద ఇంగ్లీష్ కవుల జీవిత చరిత్రలను, వారి కవిత్వ విశిష్టతను తెలియజేశారు. హర్షిణి, లోహిత తదితర విద్యార్థినులు షేక్స్పియర్, రవీంద్రనాథ్ ఠాగూర్, ఇలియట్, ఆర్.కే. నారాయణన్, డికెన్సన్, సరోజినీ నాయుడు కవితలను రాగయుక్తంగా ఆలపించారు.
కళాశాల విద్యార్థులు కార్తీక్, పార్వతి ఇంగ్లీష్ వార్తాపత్రికను చదివే విధానాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో ఇంగ్లీష్ విభాగాధిపతులు లీలా సౌమ్య, భాను ప్రవీణ్ ఆంగ్ల కవితా సంపుటిని ప్రిన్సిపల్ చేత ఆవిష్కరించగా, విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ జె. మాధవి, డాక్టర్ టి. అరుణకుమారి, డాక్టర్ కామేశ్వరరావు, రమేష్, శ్రీనివాసరావు, విమల, దీపిక, మాధవి, కావ్య తదితర అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.


Post a Comment