మా గ్రామాలకు లైన్‌మెన్లను నియమించండి..

జగన్నాధపురం, పాండురంగపురం గ్రామాలకు లైన్‌మెన్లను నియమించాలి..విద్యుత్ అధికారికి వినతి
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  జగన్నాధపురం, పాండురంగాపురం గ్రామాల్లో లైన్‌మెన్లను నియమించాలని కోరుతూ విద్యుత్ అధికారులకు పలువురు నాయకులు శనివారం వినతిపత్రం అందజేశారు. గ్రామాల్లో లైన్‌మెన్లు లేకపోవడంతో చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలకు తగిలి విద్యుత్ సరఫరా తరచుగా నిలిచిపోతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.సింగిల్‌ ఫేజ్ విద్యుత్ సరఫరా కారణంగా మోటార్లు పనిచేయకపోవడంతో ప్రజలు త్రాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను పరిష్కరించేందుకు సంబంధిత గ్రామాలకు పూర్తిస్థాయి లైన్‌మెన్లను వెంటనే నియమించాలని అధికారులను కోరారు.

ఈ కార్యక్రమంలో పాల్వంచ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొండం వెంకన్న, మాజీ జెడ్పీ చైర్మన్ బరపాటి వాసుదేవరావు, ధర్మపురి ప్రసాద్, బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.