పాల్వంచలో భీమ్ దీక్ష పోస్టర్ ఆవిష్కరణ
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : స్వేరోస్ జిల్లా అధ్యక్షుడు జైభీమ్ రవీందర్ స్వేరో ఆధ్వర్యంలో భీమ్ దీక్ష పోస్టర్ ఆవిష్కరణ మహోత్సవం ఆదివారం పాల్వంచలోని స్థానిక పూర్ణ టీ స్టాల్‌లో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్వేరోస్ రాష్ట్ర అధ్యక్షుడు చిలకబత్తిని వీరయ్య స్వేరో చేతుల మీదుగా భీమ్ దీక్ష పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 15న కాన్షీరాం జయంతిని పురస్కరించుకుని మహనీయులను స్మరించుకునే దీక్ష వేడుకల్లో భాగంగా భీమ్ దీక్ష ప్రారంభ సభను నేలకొండపల్లి బౌద్ధ స్తూపం వద్ద ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. స్వేరోస్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరుకానున్న ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని స్వేరోస్, ఆర్.ఎస్.పీ అభిమానులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ స్వేరో నాయకులు కొత్తపల్లి శ్రీనివాస్ స్వేరో, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎం.డి. మంజూర్ అలీఖాన్, తెలంగాణ ఉద్యమకారుడు ఇజ్జగాని రవి, కాంగ్రెస్ పార్టీ ఎస్.టి. సెల్ జిల్లా కార్యదర్శి దేవి లాల్ నాయక్, సీనియర్ స్వేరో నాయకులు శేషు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment