కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఎన్నికల సందడి
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : కొత్తగూడెం బార్ అసోసియేషన్‌లో ఎన్నికల కోలాహలం మొదలైంది. మార్చి 17 నుంచి 19 తేది వరకు నామినేషన్ దాఖలు ప్రక్రియ కొనసాగగా, మొత్తం 34 మంది సభ్యులు వివిధ పదవులకు నామినేషన్ వేశారు. నామినేషన్ల ప్రక్రియ రేపటి వరకు కొనసాగుతుంది.
అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, లైబ్రరీ సెక్రటరీ, ట్రెజరర్, స్పోర్ట్స్ & కల్చరల్ సెక్రటరీ, మహిళా ప్రతినిధి పోస్టుల భర్తీ కోసం పోటీ జరుగుతోంది. ఈ నెల 22న నామినేషన్ ఉపసంహరణకు గడువు కాగా, అదే రోజు సాయంత్రం 4 గంటలకు ఉపసంహరణ ప్రక్రియ ముగిసి, 5 గంటలకు తుది జాబితాను బార్ నోటీసు బోర్డుపై ప్రకటించనున్నారు.
ఈనెల 27న ఎన్నికల జరగనున్నాయి అదేరోజు సాయంత్రం ఫలితాలు కుడా వెలువడనున్నాయి. ఎన్నికల నిర్వహణ బాధ్యతను చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ పలువెల గణేష్ బాబు, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్లుగా ఎర్రపాటి కృష్ణ, పాల రాజశేఖర్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

Post a Comment